నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం

_భారీ ఆర్థిక మోసాలపై కట్టుదిట్టమైన చర్యలు

నేరెడ్‌మెట్‌లో ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ ప్రారంభం

మల్కాజిగిరి, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు ): 

ఆర్థిక నేరాలను అరికట్టేందుకు కీలక అడుగుగా నేరెడ్‌మెట్‌లో ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీస్ స్టేషన్‌ను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. సీపీఓ  ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ పోలీస్ క్వార్టర్స్ నుండి కార్యకలాపాలు ప్రారంభించింది. కమిషనర్ జీడీ ఎంట్రీ ద్వారా అధికారికంగా విధులను ప్రారంభించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ విభాగానికి రోడ్ సేఫ్టీ డీసీపీ కె. మనోహర్ పర్యవేక్షకులుగా ఉండగా, ఏసీపీలు పి. సత్తయ్య, సి. అంజయ్య సహాయకులుగా పనిచేయనున్నారు.ఇన్‌స్పెక్టర్లు కె. భాస్కర్, ఎ. సూర్య నాయక్, కె. రవి కుమార్ దర్యాప్తు బాధ్యతలు నిర్వహించనున్నారు.ఈఈఓడబ్ల్యూ స్టేషన్ ద్వారా రూ. 2 కోట్లకు పైబడిన భారీ ఆర్థిక మోసాలు, నమ్మకద్రోహం, ఫోర్జరీ కేసులు విచారణకు తీసుకోనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర డిపాజిటర్ల రక్షణ చట్టం, 1999 (2023 సవరణ) ప్రకారం రూ. 1 కోటి దాటిన డిపాజిట్ మోసాలపై కూడా దర్యాప్తు జరగనుంది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇతర కీలక ఆర్థిక నేరాల కేసులను కూడా ఈ విభాగం విచారణ చేస్తుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .