పీచర సర్పంచ్ అధ్యక్షతన  గ్రామసభ నిర్వహణ

పీచర సర్పంచ్ అధ్యక్షతన  గ్రామసభ నిర్వహణ

వేలేరు ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పీచర గ్రామంలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల ఎంపిడిఓ లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మరిజే అనిత- నరసింహారావు అధ్యక్షతన సభను ప్రారంభించారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తోట అనిల్, వార్డు సభ్యులు,వైద్య సిబ్బంది,అంగన్ వాడి టీచర్స్, గ్రామ అధికారులు,మహిళా సంఘాలు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .