పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ… 

రెగ్యులర్ రేషన్ డీలర్ కోసం డిమాండ్

పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ… 

వరంగల్,ఏప్రిల్02(తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్ జిల్లా సంగెం మండలం పెద్ద తండ గ్రామపంచాయతీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమమును  సర్పంచ్, ఉపసర్పంచ్ గుగులోత్ వినోద్ రవీందర్ నాయక్ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో రేషన్ డీలర్ షాపు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం షాపూర్ డీలర్‌ను ఇన్‌చార్జిగా నియమించినప్పటికీ, పెద్ద తండ గ్రామంలోనే శాశ్వత డీలర్ షాపు ఏర్పాటు చేయాలని కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ నెలతో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందజేయడం ద్వారా పేదలకు ఉపశమనం కలిగిందన్నారు.గ్రామ ప్రజలు కూడా పెద్ద తండలో రేషన్ డీలర్ షాపును మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్, ఉపసర్పంచ్‌లను విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి షాపు ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, డీలర్లు, లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .