సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్- 2(తెలంగాణ ముచ్చట్లు )

సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ట్యాoక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి సంఘ నాయకులు, తెలంగాణ జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, బచ్చు విజయ్ కుమార్, నూతి సత్యనారాయణ గౌడ్  డి.సి.సి. అధ్యక్షులు, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, అమరగాని వెంకన్న, వడ్డెబోయిన నరసింహ గౌడ్, మార్కం లింగయ్య గౌడ్, ఉడుగు శ్రీనివాస గౌడ్, డాక్టర్ శ్రీనివాస గౌడ్, డాక్టర్ రాజశేఖర్ గౌడ్, కోడి లింగయ్య, పగడాల నాగరాజు, షేక్ షకినా, అంబాల వెంకటేశ్వరరావు, తోడేటి దుర్గాప్రసాద్, పెరుగు వెంకటరమణ యాదవ్, జక్కుల వెంకటరమణ, బెల్లం కొండ శరత్, బండి నాగేశ్వరరావు, పెల్లూరి విజయ్ కుమార్, రమణ కుమార్, రవి కుమార్, కొప్పెల్లి శ్రీనివాస్, సమ్మయ్య, బడపట్ల సుదర్శన్, యాదాల నాగేశ్వరరావు, జ్యోత్స్న నాయక్, బత్తిని రాజు, మురళీ కృష్ణ, గంగరాజు, రామకృష్ణ, మాధవిIMG-20260402-WA0165, సతీష్, ముత్యాల రావు, వీరయ్య, మొగలయ్య, చందర్ రావు, రామకృష్ణ, బిసి కుల సంఘ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…