జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాకాల రాజ్ కుమార్ నియామకం

జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాకాల రాజ్ కుమార్ నియామకం

_మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ నూతన కార్యవర్గం 

_ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం 

– పార్టీ శ్రేణుల్లో హర్షం

కాప్రా, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చేసిన సంప్రదింపుల ఆధారంగా వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్, ప్రతినిధులు మరియు కార్యవర్గ సభ్యుల నియామకాలకు ఆమోదం లభించింది.ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాకాల రాజ్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు సమాచారం.రాజ్ కుమార్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…