“5 లక్షలు సరిపోవు… 7 లక్షలకు పెంచాలని గళమెత్తిన బీసీ నేతలు”

“5 లక్షలు సరిపోవు… 7 లక్షలకు పెంచాలని గళమెత్తిన బీసీ నేతలు”

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయం సరిపోవడం లేదని, దాన్ని రూ.7 లక్షలకు పెంచాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయం గొప్ప వరమని పేర్కొన్న ఆయన, ప్రస్తుత మార్కెట్‌లో నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇళ్లు నిర్మించడానికి ఖర్చులు అధికమవడంతో, చాలా మంది అప్పులపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని రూ.7 లక్షలకు పెంచాలని ఆయన కోరారు. అలాగే మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు నడిగోటి రమేష్, ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కొల్లిపాక క్రాంతి కుమార్, ప్రచార కార్యదర్శి పంజాల వెంకటేశ్వర్లు గౌడ్, కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .