మానవతా సేవకు నిదర్శనం… చలివేంద్రంతో ముందుకు సత్యసాయి సమితి

మానవతా సేవకు నిదర్శనం… చలివేంద్రంతో ముందుకు సత్యసాయి సమితి

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి వేడిమిని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. పట్టణ ప్రజలు, బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ తెలిపారు.
ఈ చలివేంద్రం ద్వారా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 60 రోజుల పాటు చల్లటి మినరల్ వాటర్‌ను ఉచితంగా అందించనున్నారు. అదనంగా వారానికి రెండు రోజులు రాగి జావా, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యసాయి సేవా సమితి సమాజ సేవలో ఎప్పుడూ ముందుండి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సమయంలో అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ వేసవి కాలంలో ప్రజలు చలివేంద్రాన్ని ఉపయోగించుకుని తమ దాహార్తిని తీర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యం సావిత్రి, చందా విశ్వనాథం, గన్ను ఉపేందర్, గౌరీశెట్టి సత్యనారాయణ తదితర సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .