సర్వాయి పాపన్నకు ఘన నివాళి

సర్వాయి పాపన్నకు ఘన నివాళి

_ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు ఆలస్యం పై నేతల ఆగ్రహం

_బీసీలకు న్యాయం చేయాలని, పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని డిమాండ్

కుషాయిగూడ, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలో మేడ్చల్ మల్కాజిగిరి గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, భక్తులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గౌడ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు సంబంధించిన పెండింగ్ ఎక్స్‌గ్రేషియా నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. బీసీ నాయకుడు గోగికర్ శివకుమార్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు అన్యాయం జరిగితే సహించబోమని, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.మరో నేత విద్యాసాగర్ బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు తగినంతగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి బుడంపల్లి నిరంత్ గౌడ్, మిట్టపల్లి విజయ్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రత్నపురం వెంకటేశ్వర్లు, రఘుపతి గౌడ్, గణేష్, రామకృష్ణ, పాండు గౌడ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .