“ఒక్క క్షణం లో విషాదం… పల్టీలు కొట్టిన ఆటో, డ్రైవర్ మృతి”

“ఒక్క క్షణం లో విషాదం… పల్టీలు కొట్టిన ఆటో, డ్రైవర్ మృతి”

జమ్మికుంట టోన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంట నుంచి హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటకు వెళ్తున్న ఆటో పెద్దంపల్లి మూలమలుపు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తేలుకుంట శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో డ్రైవర్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .