గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కీలకం.

బేతుపల్లిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై గ్రామసభ.

గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కీలకం.

సత్తుపల్లి, ఏప్రిల్‌ 2 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రామాభివృద్ధి సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, హెచ్‌ఈఓ అజ్మీర వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ చిట్టిమాది చెన్నకేశవులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కె. వెంకట జోగారావు, జీపీఓ నాగేశ్వరావు, వెటర్నరీ వైద్యురాలు సారిక, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వివో ఐకేపీ సిబ్బంది, పాఠశాల హెచ్‌ఎం శాంత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోనస్, గృహ జ్యోతి, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులపై వివరించారు. ఇప్పటివరకు గ్రామంలో ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను కూడా ప్రజలకు తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న కొత్త పథకాలైన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార-మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ వంటి అంశాలను వివరించారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లలోపు బాలికల వివాహాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామసభలో పాల్గొన్న ప్రజలు కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని, డ్రైనేజీ సమIMG-20260402-WA0083స్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…