పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి

పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి

పెద్దమందడి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్‌పల్లి గ్రామంలో ఆంధ్రజ్యోతి జిల్లా ఇంచార్జ్ భాస్కర్ కుమార్తె పట్టు చీర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారి ఆరాధ్యకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు వెలుగొందాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, జగత్‌పల్లి గ్రామ సర్పంచ్ వెంకన్న యాదవ్, సింగల్ విండో డైరెక్టర్ మన్యం, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, నందిమల్ల రాము, ద్వారపోగు విజయ్ బాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .