హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు అరటిపండ్ల పంపిణీ

హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు అరటిపండ్ల పంపిణీ

_కీసరలో సేవా కార్యక్రమాలు…

_ తుడుం శ్రీనివాస్ సేవాభావానికి ప్రశంసలు

కీసర, ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు)

హనుమాన్ జయంతి సందర్భంగా కీసర మండలంలో భక్తి, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కీసర హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొనగా, ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కళకళలాడింది.ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యకర్త, గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు తుడుం శ్రీనివాస్ భక్తులకు అరటిపండ్లు పంపిణీ చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు అందజేశారు. భక్తులకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తుడుం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ గోరంటి ప్రవీణ్, యువ నాయకులు నాయకపు శ్రీకాంత్ ముదిరాజ్, మొరుగు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .