వనపర్తి జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా.

వనపర్తి జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా.

వనపర్తి,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొని మాట్లాడుతూ, అంబేద్కర్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు.దేశ ప్రజలందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముందు ప్రతి పౌరుడు సమానుడని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటేనే దేశంలో శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని అన్నారు.తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ వరప్రసాద్ రావు మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని, ప్రజాస్వామ్య పరిపాలనలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు.మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి రమేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగం మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించడం ద్వారా వారి సాధికారతకు దోహదపడిందని పేర్కొన్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రూపొందించడం మాత్రమే కాకుండా దాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.అసోసియేషన్ సభ్యులు ప్రశాంత్ గౌడ్, భరత్, రాకేష్, ప్రభాకర్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హక్కులు, బాధ్యతలను సమానంగా నిర్వహించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థ సమర్థంగా నడుస్తుందని తెలిపారు. మండల విద్యాధికారులు మద్దిలేటి, జయరాములు మాట్లాడుతూ, వనపర్తి జిల్లాలో రాజ్యాంగబద్ధంగా అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ అసోసియేషన్ తరపున జిల్లా అధ్యక్షుడు ఎస్ వరప్రసాద్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .