పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .

పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .

పెద్దమందడి,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అపారమని తెలిపారు.విద్య ద్వారానే వ్యక్తిగతంగా మరియు సమాజ పరంగా అభివృద్ధి సాధ్యమని, యువత చదువుపై దృష్టి సారించాలని సూచించారు.అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల శ్రీశైలం, మాజీ సర్పంచ్ సిద్దయ్య, పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ కార్మికులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .