శ్రీ ఆదర్శలో పది విద్యార్థులకు ఘన వీడ్కోలు.
Views: 9
On
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 13(తెలంగాణ ముచ్చట్లు )
చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం సోమవారం జరిగింది. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ సూచించారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ , అకుంఠిత దీక్ష, ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగినప్పుడు అనుకున్న గమ్యాన్ని చేరుతారని ఆయన తెలిపారు. విద్యార్థులు పాఠశాల తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు . ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు బోళ్ల రేణుక, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, పందిరి పుల్లారావు, సుధాకర్, ప్రశాంతి, పార్వతి, సుజాత, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments