గోవా యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు.

గోవా యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు.

కుషాయిగూడ, ఏప్రిల్ 15 (తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుంచి ఐదు రోజుల గోవా యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.ఈ యాత్రలో గోవాతో పాటు గోకర్ణ, మురుడేశ్వర్, కుక్కే సుబ్రహ్మణ్యం, ఉడిపి, ధర్మస్థల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం కూడా కల్పించనున్నారు.ప్రత్యేక బస్సు ఈ నెల 23వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి బయలుదేరనుంది. టికెట్ ధరను రూ.5,000గా నిర్ణయించారు. భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ యాత్రలో పాల్గొనాలనుకునే వారు ముందస్తు బుకింగ్ కోసం ఫోన్  9959226145, 9603549388 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News