సత్తుపల్లి డిపోలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి డిపోలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిపో మేనేజర్, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి అందరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కేక్ కట్ చేసి జయంతి వేడుకలను మరింత ఉత్సాహంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి, వెల్ఫేర్ కమిటీ సభ్యులు పద్మావతి, సైదిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ డిపో కమిటీ సభ్యులు కల్లేపల్లి సర్వేశ్వరరావు, పి. రాఘవులు, ముత్తయ్య, బాలస్వామి, వెంకటయ్య, జగన్నాథంతదితరులు పాల్గొన్నారు.


Comments