అసమానతలపై అక్షర యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్.

ఏనుగుల రాకేష్ రెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు 

అసమానతలపై అక్షర యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్.

హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు):

భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ 50వ డివిజన్ జులైవాడ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి  మాట్లాడుతూ అంబేద్కర్ అసమానతలపై అక్షర యుద్ధం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆయన జయంతి పండుగ వాతావరణంలో జరుగుతుండటం, పార్టీలకతీతంగా అన్ని వర్గాల నాయకులు ఆదర్శంగా తీసుకునే నాయకుడిగా అంబేద్కర్ నిలిచారని తెలిపారు.

అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి జీవితాంతం కృషి చేసిన అంబేద్కర్ స్ఫూర్తితో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు చీరల పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ యువ నాయకులు అంకం లక్ష్మణ్, కృష్ణమూర్తి పాత్రను ప్రశంసించారు.

స్వాతంత్ర్య భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి, ప్రజలకు అనేక హక్కులు కల్పించి, బాధ్యతలను సూచించిన అంబేద్కర్ అందరివాడని, ఆయనను ఏ ఒక్క వర్గానికే పరిమితం చేయలేమని స్పష్టం చేశారు.అంకం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహింIMG-20260414-WA0091చిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నెక్కొండ కిషన్, డివిజన్ అధ్యక్షుడు కోటేశ్వర్, నాయకులు వీపీ రెడ్డి, కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, గుండెకాని మహేందర్, మాతంగి రమేష్, గునికంటి చందర్, బిక్షపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .