మల్కాజిగిరి కార్పొరేషన్‌కు శాశ్వత భవనం నిర్మాణం.
– రూ. 98 కోట్లకు ప్రభుత్వ అనుమతి
– ఉప్పల్‌లో 10 ఎకరాల్లో ఆధునిక కార్యాలయం
– పౌరసేవలు మరింత సమర్థవంతం:
_ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు శాశ్వత కార్యాలయ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 98 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ భాగయాత్ లేఅవుట్ ఫేజ్-IIIలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కార్యాలయం ద్వారా మున్సిపల్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరియు సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ అభివృద్ధి కోసం మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.


Comments