ఈసీఐఎల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు.
_బొంతు రాంమోహన్,
_బొంతు శ్రీదేవి యాదవ్ నివాళులు
కుషాయిగూడ, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈసీఐఎల్‌లో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా విస్తృతంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం లో చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్, నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ మరియు బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అపూర్వమైన సేవలు అందించారని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన మార్గం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని వారు స్మరించుకున్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, సేవాభావంతో సమాజ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments