4.5 కిలోల శిశువుకు నార్మల్ డెలివరీ.

అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ప్రతిభకు నిదర్శనం.

4.5 కిలోల శిశువుకు నార్మల్ డెలివరీ.

అశ్వారావుపేట, ఏప్రిల్ 4 (తెలంగాణ ముచ్చట్లు):

సాధారణంగా అధిక బరువున్న శిశువులకు శస్త్రచికిత్స ద్వారానే ప్రసవం నిర్వహించే పరిస్థితుల్లో, అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన విజయాన్ని సాధించారు. 4.5 కిలోల బరువున్న శిశువుకు నార్మల్ డెలివరీ నిర్వహించి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం తాగ్యాంపూడికి చెందిన ముంగర మమత (భర్త: శివయ్య, స్వగ్రామం: అచ్చుతాపురం, అశ్వారావుపేట మండలం)కు శుక్రవారం రాత్రి సుఖప్రసవం జరిగింది. వైద్యుల సమర్థవంతమైన పర్యవేక్షణలో తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రసూతి వైద్యురాలు డా. మౌనిక పర్యవేక్షణలో, నర్సింగ్ ఆఫీసర్ ప్రమీల రాణి సహకారంతో ఈ ప్రసవం విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .