కాప్రా సర్కిల్ అభివృద్ధికి రూ.3.72 కోట్లు నిధులు మంజూరు

కాప్రా సర్కిల్ అభివృద్ధికి రూ.3.72 కోట్లు నిధులు మంజూరు

_గాంధీనగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు

 – సీఎం రేవంత్ రెడ్డి చొరవ

కాప్రా, ఏప్రిల్ 4 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాప్రా సర్కిల్ డివిజన్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కృషి ఫలితంగా వివిధ కాలనీల అభివృద్ధి పనులకు రూ.3.72 కోట్ల నిధులు మంజూరయ్యాయి.ఈ నిధులతో కాలనీల్లో రహదారులు, మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా కాప్రా గాంధీనగర్‌లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించడం స్థానికులకు ఉపశమనం కలిగించింది.ఈ సందర్భంగా మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రొసీడింగ్ పత్రాలను గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన సత్యనారాయణ, ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ మరియు యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్. పద్మారావు, ఎన్. యాదగిరి, జి. వెంకటేష్, జి. రాజు, బి. వెంకటేష్, ఆకుల సంతోష్, బి. మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News