ప్రజాపాలనకు నిదర్శనం-లబ్ధిదారుల ఇంటికే సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్
పెద్దమందడి,ఏప్రిల్3(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో ప్రజాపాలనకు నిదర్శనంగా ఒక అభినందనీయ కార్యక్రమం నిర్వహించబడింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.దాసరి ప్రసాద్, దాసరి శ్రీనివాసులు, వడ్డే కుర్మమ్మ, గడ్డం లక్ష్మి, గట్టు అలివేలమ్మ, మద్దెల సాయమ్మ, రాయకంటి రాములు, కావాలి రేణుక, దాసరి జయమ్మ లకు చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె చంద్రశేఖర్‌తో పాటు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు కొత్తకాపు రామకృష్ణరెడ్డి, రగ్మారెడ్డి, వార్డు సభ్యులు సింగం కృష్ణయ్య, రాయికంటి రాములు, కె సత్యరెడ్డి, మనోహర్ రెడ్డి, గట్టు ధనుజయ్, గట్టు మన్యం, గట్టు రాజు, కె నాగన్న, కె కురుమయ్య, నెల్లి తిరుపతి, భూపని అంజి, సింగం నరసింహ, డి రాములు, కె కురుమూర్తి, ఎస్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు చేరువగా ఉండే విధంగా ప్రభుత్వ సహాయాన్ని నేరుగా అందజేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


Comments