మాజీ ఎమ్మెల్యేపై వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన దిష్టిబొమ్మ దహనం

_వాజపేయి పేరుతో కారిడార్‌కు డిమాండ్

మాజీ ఎమ్మెల్యేపై వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన దిష్టిబొమ్మ దహనం

నాచారం, ఏప్రిల్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

మాజీ శాసనసభ్యులు ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్‌పై ప్రస్తుత శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు పరస్పరం గౌరవం పాటించాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగతంగా దూషణలు చేయడం తగదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణంలో ఉన్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాజపేయి దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన పేరును ప్రాజెక్టుకు ఇవ్వడం సముచితం అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సభ్యులు సంగిశెట్టి రవీంద్రసాగర్, గోపి, అపర్ణ గౌడ్, మంజులవాణి, సబితా యాదవ్, లింగం గౌడ్, నరేష్, శ్రీనివాస్, కురుమ ఆనంద్, మధు తదితర బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.నిరసన కార్యక్రమం సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .