ఎర్రకుంట స్మశాన వాటికకు నూతన కమిటీ
_బస్తి వాసుల ఏకగ్రీవ నిర్ణయం
– అభివృద్ధి పనులకు శ్రీకారం
ఉప్పల్, ఏప్రిల్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో ఎర్రకుంట లోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధి, నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశంతో స్థానిక బస్తి వాసులు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కమిటీ ఏర్పాటుపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.నూతన కమిటీలో శ్రీమూర్తి నాగరాజును అధ్యక్షుడిగా, ఎడ్ల కార్తీక్‌ను ప్రధాన కార్యదర్శిగా, కొమ్మగాళ్ల కౌశిక్‌ను కోశాధికారిగా ఎన్నుకున్నారు. స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశుభ్రత నిర్వహణ, ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎర్రకుంట బస్తి నివాసులు నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, అభివృద్ధి కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


Comments