ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై చర్లపల్లి బీజేపీ ఆగ్రహం

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై చర్లపల్లి బీజేపీ ఆగ్రహం

_ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్…

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం


చర్లపల్లి, ఏప్రిల్ 04 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్‌లో బీజేపీ నాయకులు ఆగ్రహంతో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. డివిజన్ అధ్యక్షులు చల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఉప్పల్ నుండి నారపల్లి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ అంశంపై ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన నాయకులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైల్వే బోర్డ్ సభ్యులు డి.నాదం, ఎం.లక్ష్మణ్ గౌడ్, బీజేపీ మీడియా సెల్ కన్వీనర్ తాళ్ల ఆనంద్ గౌడ్, గ్లాసుల సురేందర్ గౌడ్, ఇస్లావత్ హరినాయక్, పవన్ కుమార్, రామకృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఎస్.అశోక్, శంకర్, వంశరాజ్, సహదేవ్ గౌడ్, వి.రాంబాబు, సిహెచ్.శ్రీకాంత్, రాజేష్ వంశరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News