విజయవంతంగా “రన్ ఫర్ జీసస్”
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్4/ తెలంగాణ ముచ్చట్లు
జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో క్రైస్తవ సంఘాలు విశ్వాసులు కలిసి నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది.
స్థానిక రైల్వే స్టేషన్ వద్ద సెయింట్ థామస్ పాఠశాల కేసి జాన్ బన్నీ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమం మాత గాంధీ చౌరస్తా మీదుగా కాలనీ మెస్సియా మినిస్ట్రీస్ చర్చి వరకు కొనసాగింది. మార్గమంతా విశ్వాసులు సువార్త ప్రకటిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అనేక మంది విశ్వాసులు యవనస్తులు ఉత్సాహంగా పాల్గొని, క్రమశిక్షణతో పరుగును పూర్తి చేశారు. కార్యక్రమం అనంతరం క్రైస్తవ పెద్దలు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య పదాధికారులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు:
అధ్యక్షుడు: రెవ. కుమార్
కార్యదర్శి: రెవ. కేస్ డానియల్
ఖజానాదారు: బ్ర. జోయల్
ఉపాధ్యక్షుడు: కే రత్నం
సహ కార్యదర్శి: విజయం
సలహాదారులు: రెవ. దేవవరం, రెవ. బాలస్వామి, రెవ. నిర్మల్, జ్యోతి బాబు, అబ్రహం బాబు, జాన్ బన్నీ, ప్రవీణ్, రెవ. తిమోతి, రెవ. టెక్నో, ఫిలిప్పు కుమార్, లు పాల్గొన్నారు.


Comments