పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్న ఇందిరమ్మ రాజ్యం

పెద్దమందడిలో సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు 

పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్న ఇందిరమ్మ రాజ్యం

పెద్దమందడి,ఏప్రిల్3(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఆదరణగా ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు లబ్ధిదారులకు ఈ సహాయం అందించడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలనే లక్ష్యంతో వేగంగా స్పందిస్తూ చెక్కులు మంజూరు చేయిస్తున్న తీరు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపించే నాయకత్వం నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఐ సత్యరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి, ఉప సర్పంచ్ బోయిని ఉషన్న యాదవ్, సూర్య రవి, సీనియర్ నాయకులు పల్లె సత్యనారాయణ, వాకిటి నరేష్, ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర, గట్టు రాజశేఖర్, జంగం శివ, కురుమన్న, అశోక్, దర్శన్, వెంకటన్న, శ్రీను, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ ఆపద సమయంలో ఆదుకున్న ప్రభుత్వం తమకు దైవసమానమని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు భరోసా కలుగుతోందని, శాసనసభ్యుల చొరవతో తమకు ఆర్థికంగా ఉపశమనం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేదల పక్షాన నిలిచే ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News