ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు
విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు పద్మ
ఖమ్మం బ్యూరో,ఏప్రిల్ 4(తెలంగాణ ముచ్చట్లు)
గత సంవత్సర కాలంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన అమ్మడి పూడి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమ్మడి పూడి పద్మ మాట్లాడుతూ... తన తండ్రి అమ్మడి పూడి సత్యం కు మొదటి భార్య మంగమ్మకు ఐదుగురు సంతానమని , రెండో భార్య భాగ్యమ్మకు ఒక కుమారుడు జన్మించాడని, తన తండ్రి తో పాటు ఇద్దరు భార్యలు కూడా మృతి చెంది చాలా కాలం అవుతుందని తెలిపారు. ఇద్దరు భార్యలకు కలిగిన సంతానానికి ఉమ్మడిగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం కామేపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో గత సంవత్సరం క్రితం ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు. సర్టిఫికెట్ కోసం తహసిల్దార్ ను కలిస్తే ఆర్ ఐ ని కలవమని, ఆర్ ఐ ని కలిస్తే వీఆర్వో ను కలవమని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు కుటుంబ సభ్యులు కలిసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన సకాలంలో సర్టిఫికెట్ ఇవ్వకుండా చెప్పులు అరిగేలా తిరిగిన సర్టిఫికెట్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొనే హక్కు తమకు ఉందని, కానీ కామేపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలో అధికారుల తీరు అభ్యంతరకరంగా, అనాలోచిత చర్యగా ఉందని, జిల్లాలో బహుశా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా కేవలం కామేపల్లి మండల తాసిల్దార్ కార్యాలయంలోనే ఇటువంటి వింత ప్రవర్తన కలిగి ఉండటం విచారకరమని మండిపడ్డారు.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని తక్షణమే తమకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటన మరెవరికి రాకూడదని వేడుకున్నారు. జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ ఇతర ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని తమకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Comments