ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు వివాదం

ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు వివాదం

_రాజకీయాలకు బలి కాకూడదని ఎమ్మెల్యే హెచ్చరిక

_బండారి రాజిరెడ్డి సేవలకు గుర్తింపుగా పేరు 

– మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర స్పందన

 ఉప్పల్, ఏప్రిల్ 3 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News