సూరారంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ

కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.

సూరారంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ

అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి నమోదు చేయాలి – అధికారులకు మంత్రి ఆదేశం

ఎల్కతుర్తి, జూన్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) బూత్ స్థాయి ప్రతినిధులు (బీఎల్ఏలు) తో సమావేశమైన మంత్రి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి ఇంటింటికీ వెళ్లి ఇంటి వారీ వివరాల నమోదు (ఎన్యూమరేషన్) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామ సర్పంచ్‌తో పాటు స్థానిక ప్రజలతో సమావేశమైన మంత్రి, సూరారం గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీఓ రవీందర్, మండల వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్, సూరారం గ్రామ సర్పంచ్ నీల కొమరయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగే శ్రీకాంత్, డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు, గుడెల్లి నవీన్ కుమార్, శనగరపు వెంకటేష్, అంబాల స్వామి, పులి కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, పుల్లూరి శ్రీధర్ రావు, రవీందర్ గౌడ్, గూటం జోజి రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ఈర భీమ్‌రాజ్, మండ సుమన్, అంబాల రమేష్, ఠాకూర్ రామ్‌సింగ్, బుసరి వినయ్, బొంకూరి క్రాంతికుమార్, అడ్డూరి అనిల్, నవీన్, ప్రశాంత్, కుడుతాడి రమేష్, అంబీర్ చందర్, సుకినే గోపాల్ రావు, సింగిల్ విండో డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్నికల సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.IMG-20260630-WA0015

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .