సకాల వర్షాలకై వెల్టూరులో ఘట్టాభిషేకం.

సకాల వర్షాలకై వెల్టూరులో ఘట్టాభిషేకం.

పెద్దమందడి,జూన్29(తెలంగాణ ముచ్చట్లు):

జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఘట్టాభిషేకం (గంగాభిషేకం)ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రధాన పూజారి శివకుమార్ ఆధ్వర్యంలో పవిత్ర జలాలతో స్వామివారికి ఘట్టాభిషేకం నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. గ్రామ శ్రేయస్సు, సకాల వర్షాలు, పంటల సమృద్ధి కోసం ఈ ప్రత్యేక ఘట్టాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆలయ పూజారి శివకుమార్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .