తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ.

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ.

ఖమ్మం బ్యూరో , జూన్ 23(తెలంగాణ ముచ్చట్లు )

ఈ నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న "తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం" పోస్టర్‌ను స్థానిక ఏ 7 స్టూడియోస్ లో తెలంగాణ ఉద్యమ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి, డాక్టర్ కె.వి. కృష్ణారావు, నందిగామ రాజ్ కుమార్ జానీ, బొబ్బిలి భరత్ చంద్ర, వేల్పుల మురళీ, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అయితే రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు నేటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25,000 గౌరవ పెన్షన్, ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఉద్యమకారుల ప్రత్యేక కోటా, అలాగే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన, ఉద్యమకారుల గౌరవ పరిరక్షణ మరియు వారి హక్కుల సాధనే లక్ష్యంగా ఈ సమ్మేళనం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు.
స్టేషన్ ఘనపూర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు): తాటికొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారపాక బుచ్చయ్య మరణం పట్ల ఆయన కుటుంబానికి టెన్త్ క్లాస్ 2004-05 బ్యాచ్...
కార్మిక గర్జన సభకు ఎంపీ కడియం కావ్యకు ఆహ్వానం .
గ్రామాల అభివృద్ధే ధ్యేయం.
చింత వరుణ్ తేజ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్‌ను కలిసిన  టిఐసీసీఐ  రాష్ట్ర నాయకులు.
57వ డివిజన్ బూత్ స్థాయి ఎన్నికల బాధ్యుల సమావేశం.