కార్మిక గర్జన సభకు ఎంపీ కడియం కావ్యకు ఆహ్వానం .

హన్మకొండ,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):

భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమ హక్కుల సాధన లక్ష్యంగా జూలై 5న హనుమకొండ జిల్లా మడికొండలోని కరిష్మా గార్డెన్‌లో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల కార్మిక గర్జన మహాసభకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
బీఎన్‌ఆర్‌కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం ఆదేశాల మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్, హనుమకొండ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి భిక్షపతి, జిల్లా సహ కన్వీనర్ ఉపేందర్ కలిసి ఎంపీ కడియం కావ్యకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణ అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు. మహాసభకు తప్పకుండా హాజరవుతానని ఎంపీ కడియం కావ్య హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
జూలై 5న జరిగే కార్మిక గర్జన మహాసభను విజయవంతం చేయాలని, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్ పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .