సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్‌కు ఘన సన్మానం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్‌కు ఘన సన్మానం.

హుజూరాబాద్, జూన్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, సామాజిక కార్యకర్త సబ్బని రమేష్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుడిగా నియమితులవడంతో పట్టణంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి *చిలుకమారి శ్రీనివాస్* ఆధ్వర్యంలో స్థానిక టాప్ రా కార్యాలయంలో రమేష్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, తెలంగాణ ఫిల్మ్ అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజర్ సందెల వెంకన్న మాట్లాడుతూ, హుజూరాబాద్ పద్మశాలి సమాజానికి చెందిన వ్యక్తి జాతీయ స్థాయి సంస్థలో సభ్యుడిగా ఎంపిక కావడం గర్వకారణమనిm పేర్కొన్నారు. సబ్బని రమేష్ గత ఇరవై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తూ పార్టీ విశ్వాసాన్ని చూరగొన్నారని తెలిపారు.
సమాజ సేవ, రాజకీయ రంగంలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావానికి గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతనుm అప్పగించిందన్నారు. సీబీఎఫ్‌సీ సభ్యుడిగా రమేష్ నియామకం హుజూరాబాద్ ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత పెంచిందని కొనియాడారు.
ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు సభ్యుడిగా మంచి విలువలతో కూడిన చిత్రాలకు ప్రోత్సాహం అందిస్తూ, యువతకు మార్గదర్శకంగా నిలిచే సినిమాలకు సహకరించాలని ఆకాంక్షించారు. అదే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి హుజూరాబాద్‌కు మరింత పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సన్మానానికి స్పందించిన సబ్బని రమేష్, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. సమాజ సేవతో పాటు సినీ రంగానికి సంబంధించిన బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్, బీసీ ఆజాదీ ఫెడరేషన్ అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ హుజూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు మార్త రవీందర్, కుడికాల ప్రభాకర్, గాలి సమ్మయ్య, తాటిపాముల దేవేందర్, కేఆర్ బిక్షపతి తదితరులు పాల్గొని రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
"సబ్బని రమేష్ నియామకం హుజూరాబాద్ ప్రజల గర్వకారణం – పద్మశాలి సంఘం నాయకులు"

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .