ప్రజల గడపకే సంక్షేమం.. ప్రజల సేవే లక్ష్యం..!

ప్రజల గడపకే సంక్షేమం.. ప్రజల సేవే లక్ష్యం..!

* సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట టౌన్ జూన్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తన ప్రజాసేవా నిబద్ధతను చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) మంజూరైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులను అందజేశారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు అవసరమైన సమయంలో ఆర్థిక చేయూత అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, లబ్ధిదారుల గడప వద్దకే సహాయాన్ని చేర్చడం ద్వారా ప్రజల పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు. చెక్కుల పంపిణీ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులు, నమ్మకమే తనకు బలమని, ప్రతి సమస్యలో ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సేవే తన ధ్యేయమని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని పేర్కొన్నారుIMG-20260623-WA0067.

"ప్రజల నమ్మకమే బలం... ప్రజల సేవే ధ్యేయం... సంక్షేమమే లక్ష్యం" అనే నినాదంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .