ప్రజల పక్షాన పోరాటమే టీఆర్‌ఎస్ లక్ష్యం.

దామోదర్ గౌడ్ దేవరకద్ర ఇంచార్జ్.

ప్రజల పక్షాన పోరాటమే టీఆర్‌ఎస్ లక్ష్యం.

మదనాపురం,జూన్20(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తూ ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) దేవరకద్ర ఇన్‌చార్జ్ జి. దామోదర్ గౌడ్ అన్నారు. శనివారం మదనాపురం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించగా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల హక్కుల పరిరక్షణ, రైతుల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందన్నారు.అధికారమే లక్ష్యంగా కాకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడడమే పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ వెంకట రామమూర్తి, మహబూబ్‌నగర్ ఇన్‌చార్జ్ ప్రభాకర్, వనపర్తి జిల్లా ఇన్‌చార్జ్ కరాటే శీను, నాయకులు మహేందర్ రెడ్డి, విజయ్, స్వామి, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .