బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.

బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.

అడ్డాకల్, జూన్15(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామంలో ఆర్టీఐ ద్వారా చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గ్రామ సర్పంచ్ కోట్ల కరుణాకర్ రెడ్డి, రైతులు, మహిళలు స్పష్టం చేశారు. మంగళవారం  ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మహిళా సంఘాలు, వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు.వరి కొనుగోళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని రైతులు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు సక్రమంగా జమయ్యాయని, ఎలాంటి అక్రమాలకు తావులేదని వివరించారు.అలాగే గ్రామ మహిళా సంఘాల నిర్వహణలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదని మహిళలు తెలిపారు.కొందరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో గ్రామ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు.గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సామాజిక మాధ్యమాలు మరియు ఇతర వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేయకుండా గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .