తల్లిని కోల్పోయిన చిన్నారి భవ్యశ్రీకి పూర్వ విద్యార్థుల అండ.

తల్లిని కోల్పోయిన చిన్నారి భవ్యశ్రీకి పూర్వ విద్యార్థుల అండ.

పెద్దమందడి,జూన్14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా  పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుతూ తమ తోటి స్నేహితురాలి కుమార్తెకు ఆర్థిక సహాయాన్ని అందించారు. పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన రేణుక, పెద్దమందడి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 బ్యాచ్‌లో పదో తరగతి చదివారు. ఇటీవల నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆమె మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ఆమె తోటి స్నేహితులు ,తల్లిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన కుమార్తె భవ్యశ్రీకి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2005-06 బ్యాచ్ స్నేహితులు అందరూ కలిసి రూ.50 వేల నగదును సమీకరించి భవ్యశ్రీకి ఆర్థిక సహాయంగా అందించారు.చిన్నారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని భవ్యశ్రీ పేరుతో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించారు.అలాగే భవిష్యత్తులో భవ్యశ్రీ విద్యాభ్యాసానికి అవసరమైన ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారికి ధైర్యం చెబుతూ ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .