ఉపాధి కూలీలకు నష్టం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలి.

సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్.

ఉపాధి కూలీలకు నష్టం చేసే చర్యలను ఉపసంహరించుకోవాలి.

ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు )

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వి బి జీ రాం జీగా పేరుమార్చి వ్యవసాయ కార్మికులకు నష్టం చేకూరిస్తే మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు) జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం తాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దండి సురేష్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి -వేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పికొట్టే వరకు ఉద్యమించాలన్నారు. యుపిఏ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ సాధించిన వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించే ఎంజిఎన్ఆర్జిఏ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. పేద ప్రజల హక్కుల కోసం కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను హరించివేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందన్నారు. దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా చైతన్యవంతమైన పోరాటాలకు సిద్దం కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లుకట్టించి ఇవ్వాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బికెఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. విబి జీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి ఎంజిఎన్ఆర్ఆజిఏ చట్టాన్ని కొనసాగించాలని, 200 రోజులు పని కల్పించాలని, 55 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు ఆరువేల ప్రభుత్వ పెన్షన్ ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు -నెలకు రూ.2500 ఇవ్వాలని తదితర డిమాండ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్వహించే ధర్నాలో వ్యవసాయ కార్మికులు అధిక -సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏసు, జిల్లా ఆఫీస్ బేరర్స్ మేళ్లచెరువు వీరబాబు, సింగారపు -సత్యనారాయణ, పిట్టల రాంబాబు, అయోధ్య, గోగుల ఆది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం. కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు...
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.
శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.
మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.
రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం.
పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.