కొత్తపల్లి గ్రామంలో బెల్ట్ షాపులపై పూర్తి నిషేధం.

గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం – ఉల్లంఘనలకు రూ.10 వేల జరిమానా.

కొత్తపల్లి గ్రామంలో బెల్ట్ షాపులపై పూర్తి నిషేధం.

భీమదేవరపల్లి, జూన్ 09(తెలంగాణ ముచ్చట్లు): ప్రజల

ఆరోగ్యం, శాంతిభద్రతలు మరియు గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్తపల్లి గ్రామ పరిధిలో బెల్ట్ షాపులు (అనధికార మద్యం విక్రయ కేంద్రాలు) పూర్తిగా నిషేధిస్తున్నట్లు గ్రామ పంచాయతీ   ప్రకటించింది.గ్రామసభలో మహిళా సంఘాల ఫిర్యాదు మేరకు గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసినట్లు సర్పంచ్ సిక ప్రదీప్ తెలిపారు.

గ్రామ పంచాయతీ విడుదల చేసిన బహిరంగ ప్రకటన ప్రకారం, గ్రామ పరిధిలోని అన్ని బెల్ట్ షాపులు మరియు ఇతర అనధికార మద్యం విక్రయ కేంద్రాల నిర్వహణను జూన్ 12 నుంచి శాశ్వతంగా నిషేధించారు. ఇకపై గ్రామంలో ఎవరూ అనధికారంగా మద్యం విక్రయించడం, కొనుగోలు చేయడం లేదా నిల్వ ఉంచడం చేయరాదని స్పష్టం చేశారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు గ్రామ పంచాయతీ హెచ్చరించింది. అవసరమైతే సంబంధిత అధికారుల ద్వారా అదనపు పరిపాలనా చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొంది.

గ్రామస్తులు, వ్యాపారులు, యువత, మహిళలు సహా ప్రజలందరూ గ్రామసభ తీర్మానాన్ని గౌరవించి, గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News