సేంద్రియ వంకాయలతో వినియోగదారుల మన్ననలు పొందుతున్న రైతు.

సేంద్రియ వంకాయలతో వినియోగదారుల మన్ననలు పొందుతున్న రైతు.

వనపర్తి,జూన్14(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పానుగల్ మండలం ఆకునోనిపల్లి గ్రామానికి చెందిన రైతు జూటూరు స్వామి సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలను వనపర్తి మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతున్నారు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ ఆరోగ్యకరమైన కూరగాయల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు.గత రెండు నెలలుగా సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలను మార్కెట్లో విక్రయిస్తున్నామని, వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని రైతు స్వామి తెలిపారు.నాణ్యమైన, ఆరోగ్యకరమైన కూరగాయలను ప్రజలకు అందుబాటు ధరలో అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.త్వరలో మరిన్ని కూరగాయలను కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.సేంద్రియ వ్యవసాయం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా భూమి సారాన్ని కాపాడుతుందని, రైతులు ఈ విధానాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు.సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలు కొనుగోలు చేయాలనుకునే వారు రైతు జూటూరు స్వామిని 72888 11005 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .