హుజురాబాద్ కాంగ్రెస్ అడ్డా.. బీఆర్ఎస్‌కు ప్రజల్లో బలం లేదు: వొడితల ప్రణవ్.

హుజురాబాద్ కాంగ్రెస్ అడ్డా.. బీఆర్ఎస్‌కు ప్రజల్లో బలం లేదు: వొడితల ప్రణవ్.

హుజురాబాద్, జూన్ 13(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని, రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రతాప్ సాయి గార్డెన్‌లోఎస్ ఐ ర్ బి ఎల్ ఎ ల అవగాహన సదస్సు ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ఉప ఎన్నికల తర్వాత రెండున్నర సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ హుజురాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ఎమ్మెల్సీగా, విప్‌గా ఉన్న కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి ఎలాంటి ప్రత్యేక నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. అభివృద్ధి చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యలకు స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హుజురాబాద్‌కు ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రొసీడింగ్స్ కూడా అమలు చేయలేదని విమర్శించారు. అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతు సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని పేర్కొంటూ, వడ్లు, మక్కల కొనుగోళ్లలో రైతులకు పూర్తి న్యాయం చేశామని తెలిపారు. జమ్మికుంట మార్కెట్‌లో లక్ష క్వింటాళ్లకు పైగా మక్కలు కొనుగోలు చేసి చివరి గింజ వరకు రైతులకు మద్దతు కల్పించామని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ పూర్తి చేయలేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే రైతు రుణమాఫీ అమలు చేసిందన్నారు.
సి ఐ ర్జా బితా సవరణల విషయంలో పార్టీ నాయకులు, బి ఎల్ ఏ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త పేర్ల నమోదు వంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు, వైస్ చైర్‌పర్సన్ అంజలి, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులు, సర్పంచులు, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, సోషల్ మీడియా ఇంచార్జీలు, IMG-20260613-WA0185వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .