ముల్కనూర్‌లో గ్రామ సభ నిర్వహణ – సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

ముల్కనూర్‌లో గ్రామ సభ నిర్వహణ – సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

భీమదేవరపల్లి, జూన్ 10(తెలంగాణ ముచ్చట్లు)

ముల్కనూర్ గ్రామంలో సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి మరియు గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు మండల ఎంపీడీవో, ఎంఈఓ, వ్యవసాయ శాఖ ఏఓ, ముల్కనూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రభుత్వ బాలికల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

గ్రామాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్య, వ్యవసాయం, గ్రామ సమస్యలు తదితర అంశాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి, వారి సూచనలు స్వీకరించారు.

అనంతరం గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అశోక్ ముఖర్జీ, ఆదరి రవి, సుదర్శన్ రెడ్డి, కొలుగూరి రాజు, చిటుకూరి అనిల్, గుడికందుల రాజు, మాడుగుల గోపి, చిటుకూరి నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .