తెలంగాణ ఆవిర్భావ స్పూర్తితో ఘనంగా వేడుకలు.

బడిబాట కార్యక్రమానికి విశేష స్పందన.

తెలంగాణ ఆవిర్భావ స్పూర్తితో ఘనంగా వేడుకలు.

పెద్దమందడి,జూన్03( తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మద్దిగట్ల - మోజర్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావానికి పునాదులు వేసిన ఆచార్య జయశంకర్‌తో పాటు తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర విద్యార్థులకు ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన త్యాగాలు రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు విద్య, క్రీడలు, సాంకేతికత తదితర అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించి వారి సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, శ్రీమతి వాణిప్రభ, కె. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, చిన్నారెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .