ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి బాసర ఐఐఐటీలో సీటు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి బాసర ఐఐఐటీలో సీటు.

హుజూరాబాద్, జూన్ 2(తెలంగాణ ముచ్చట్లు ):
 
ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని, పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని కళ్లెపు అభినయశ్రీ నిరూపించింది. ఇప్పల్ నర్సింగాపూర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల (యూపీఎస్)లో ప్రాథమిక విద్య అభ్యసించిన అభినయశ్రీ ఇటీవల విడుదలైన బాసర ఐఐఐటీ ప్రవేశ ఫలితాల్లో సీటు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
క్రాంతి కుమార్ కుమార్తె అయిన అభినయశ్రీ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించినప్పటికీ ఆమె తన ప్రతిభతో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అనంతరం జరిగిన ప్రవేశ ప్రక్రియలో ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీలో సీటు కైవసం చేసుకుని తన లక్ష్య సాధనలో మరో ముందడుగు వేసింది.
అభినయశ్రీ సాధించిన విజయంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందడం పట్ల తండ్రి క్రాంతి కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇప్పల్ నర్సింగాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినయశ్రీని, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి అభినందనలు తెలియజేసి మిఠాయిలు పంచిపెట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, క్రమశిక్షణతో పాటు నిరంతర శ్రమ ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
అభినయశ్రీ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని అభినయశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .