వేలేరు – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్ ప్రారంభం.

వేలేరు – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్ ప్రారంభం.

వేలేరు, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో వేలేరు నుండి హైదరాబాద్‌కు నూతన ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రయాణికులు ఈ కొత్త బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ద్వారా మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి, పెద్దపెండ్యాల గ్రామ సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ, వేలేరు మరియు ధర్మసాగర్ మండలాల ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో డిపో మేనేజర్, తహసీల్దార్, ఎంపీడీవో, ఏఓతో పాటు సర్పంచులు అశోక్, మనోజ్, శ్రీనివాస్, సాంబయ్య, కిరణ్, రాజు, అరుణ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్, మల్లికార్జున్, రామ్‌రెడ్డి, IMG-20260601-WA0063లక్ష్మణ్ నాయక్, రాజిరెడ్డి, రవీందర్ యాదవ్, ఉప సర్పంచులు శ్రీకర్, రమేష్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .