చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.

చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.

జమ్మికుంట టౌన్ మే 30 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో చిట్టీ డబ్బుల వివాదం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన అరుకాల సాయికుమార్ అనే యువకుడు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.

స్థానికుల వివరాల ప్రకారం, సాయికుమార్ జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.6 లక్షల మేర చిట్టీ డబ్బులు కట్టినట్లు తెలిసింది. అయితే గడువు ముగిసినప్పటికీ తన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, తనకు చెందిన బంగారు గొలుసు, క్రెడిట్ కార్డులను కూడా తిరిగి అందించడం లేదని అతడు ఆరోపించాడు.

ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్, “ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను” అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ పురుగుమందు సేవించినట్లు సమాచారం.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .