వడ్డే కొండయ్య జ్ఞాపకార్థంగా దేవాలయానికి ఐమాక్స్ లైట్ డొనేషన్

వడ్డే కొండయ్య జ్ఞాపకార్థంగా దేవాలయానికి ఐమాక్స్ లైట్ డొనేషన్

పెద్దమందడి,మే29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వడ్డే కొండయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు వడ్డే శ్రీనివాస్ ఐమాక్స్ లైట్‌ను డొనేషన్‌గా అందజేశారు. దేవాలయంలో భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు ఐమాక్స్ లైట్ దాత శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు శివకుమార్ స్వామి మాట్లాడుతూ… వడ్డే కొండయ్య  సేవాభావం కలిగిన వ్యక్తి అని, వారి జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు చేసిన ఈ సేవ అభినందనీయమన్నారు.దేవాలయ అభివృద్ధికి భక్తులు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.అలాగే వడ్డే శ్రీనివాస్ కుటుంబ సభ్యులందరికీ శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .