సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ.

- సత్తుపల్లి బస్టాండ్‌లో ప్రయాణికులకు శీతల ఉపశమనం.

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ.

సత్తుపల్లి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):
 
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రయాణికులకు ఉపశమనం కలిగించడం హర్షణీయమని తెలిపారు. వేసవి మొత్తం ఈ సేవ కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి ఎండాకాలం అంతా బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ చేయాలని సత్యసాయి సేవా సమితి నిర్ణయించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఇన్‌చార్జ్ ప్రతాప్, రత్తయ్య, యూత్ ఇన్‌చార్జ్ సావిత్రి, కమల, చెన్నమ్మ, శ్రీలక్ష్మి, బాలవికాస్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే సత్యసాయి సంస్థల ఖమ్మం జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త తనూజ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్ కుమార్, వి.బి.ఓ కిన్నెర ఆనందరావు తదితరులు హాజరయ్యారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .